మేమిక్కడున్నాం | We’re Here

By and | 1 October 2016

Translated from the English to the Telugu by Joopaka Subhadra

మేము మీ …
వైద్యులమ్ కళాకారులమ్ కవులమ్
మీకు చదువు చెప్పే గురువులము , మీ న్యాయ వాదులమ్
మీ సమాచార సాంకేతిక నిపుణులమ్
మీ పారిశుధ్య కార్మికులమ్ , సంగీతకారులమ్
నటులము , మీ మూల దుకాణాల్లో పనోల్లమ్
బస్సుల్ని నడిపేవాల్లము , భవన నిర్మాణకులం
జీతమ్ లేని వెట్టి వాల్లము
మీ నైడాక్ (NAIDOC) కమిటీ సభ్యులము
మీ పాఠశాలల్లో స్వచ్చంద సేవకులము
మీ ఆదాయ వనరులమ్, నర్సులము
మీ వంట గదిలో ‘ చాయ్ గిన్నె‘ మీది మూతలము
మీ ఇండ్లల్ల పనోల్లం, మీ యిండ్లకు యెట్టి కాపలాదారులము
సైనికులమ్ , క్రీడా నాయకులమ్, ప్రముఖులమ్
సకల వృత్తులకు మేమే ప్రతినిధులమ్
మేము కొంటాము , అమ్ముతాము
కాపాడుతామ్, ఖర్చు బెడ్తామ్

2

మేమిక్కడ వున్నాము
మీ అంతం దాకా మేమిక్కడే
మీ చావు దాకా మేమిక్కన్నే

మేము మీ …
తోబుట్టువుల బిడ్డలము , కొడుకులము
అక్కా చెల్లెండ్లము అన్నదమ్ములము ,
మీ పిల్లల్ని పెంచే ఆయాలము
తండ్రులము , తల్లులము , మరదండ్లము , బావ బామ్మరుదులము
అత్తా చిన్నమ్మలము , మామా చిన్నాయినలము
కొడుకులమ్, కూతుర్లము, దోస్తులము
మీకన్నీ అయినోల్లమ్, మీ పక్కింటోల్లమ్
మీ బండ్లు నడిపేటోల్లమ్, చిట్టి చెల్లెల్లమ్
హిజ్రాలము , ఆడ మగ కలపోతలము , ఎల్జీబీటీలము
మేము పోరాడుతాం , మేము కలలుగంటామ్
మేము ప్రేమిస్తాం , మేము ప్రార్ధిస్తామ్
మేము నవ్వుతాం , ఏడుస్తామ్ , మేము నెత్తురోడుతామ్

3

మేము పురా తరాల్నించి మెరుగవుతాము
మేము కిందకు పడిపోయినము
మేమిక్కడ వున్నాము
మీ చావు దాకా మేమిక్కడే
మీ అంతం దాకా మేమిక్కడే

మేము మీ …
పాటల రచయితలము
నల్ల వారి హక్కుల ప్రచారకులము
రాత్రి క్లబ్బుల్ల ఆడి పాడే వాల్లము , మీ పూల హారాలము
మీ ముసలోల్లకు చాకిరీలు చేసెటోల్లము
మీకు కాఫీలందించే వాల్లము
మీ పొయిలకు వూదు గొట్టాలము
మీ చలి నెగల్లము , మీ వాహనాలము
మీ పర్యటనలకు దారి దీపాలము
మీ నాట్యశాల గానాలము , స్వాతంత్ర్య సమరాలము
మీ చర్చి గంటల నాదాలము

4

అల్ప సంఖ్యాకుల్లో అల్ప సంఖ్యాకులమ్
తళ తళ మెరిసే యీ భూగోళం భిన్నత్వాల చిన్నెలున్నది
ఆ ఏడు రంగుల ఇంద్ర ధనసు దారుల్లో మేము నడుస్తామ్
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మల్లీ మల్లీ
మేము నడుస్తానే వుంటాము
మేమిక్కడ వున్నాము
మీ చావు వరకు మేమిక్కడే
మీ చావు దాకా మేమిక్కడే

నెత్తుటి యాది కతలు , మాట , మట్టి
జెండా ఎత్తుగ ఎగురుతుంది
మేము తలెత్తుకుని నిటారుగా నిలబడ్డాం
ఎడారి , పచ్చిక మైదానాలు , నదులు , సముద్రం
మేము కారుణ్యం తో కదిలాము హుందాగ
మా మానవత్వాన్ని గౌరవించు
మా భిన్నత్వము మా సహజత్వము
ఎప్పుడూ వుండింది , ఎప్పుడూ వుంటుంది

5

మేమిక్కడ వున్నాము
మేమిక్కడే వున్నాము

మూలం ; నటాలీ హార్కిన్
తెలుగు అనువాదం ; జూపాక సుభద్ర

This entry was posted in 76: DALIT INDIGENOUS and tagged , . Bookmark the permalink.

Related work:

Comments are closed.